JGL: బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ధర్మపురి పట్టణంలోని స్థానిక గాంధీ విగ్రహం వద్ద పట్టణ అధ్యక్షుడు గాజు భాస్కర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్, ఇండియా కూటమి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పిల్లి శ్రీనివాస్, పలువురు నాయకులు పాల్గొన్నారు.