IPL 2026లో భాగంగా SRHతో జరిగిన మ్యాచ్లో CSK 10 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ ఓటమితో CSK పలు చెత్త రికార్డులను సొంతం చేసుకుంది. 2019 తర్వాత ఆ జట్టు ఇప్పటివరకు ఒక్క మ్యాచ్లో కూడా 180 ప్లస్ టార్గెట్ను ఛేదించలేదు. CSK చివరిసారిగా 180 ప్లస్ టార్గెట్ను 2018లో ఇదే SRHపై ఛేదించింది. అలాగే, ఉప్పల్ స్టేడియంలో SRHతో CSK ఎనిమిదేళ్లుగా ఒక్క గెలుపూ నమోదు చేయలేదు.