TG: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనారోగ్యంపై మాజీమంత్రి కేటీఆర్ స్పందింస్తూ.. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా మారి, ప్రజా జీవితంలో మరింత చురుగ్గా పాల్గొనాలని ఆశిస్తున్నానని ‘X’ వేదికగా తెలిపారు. కాగా, ఆరోగ్య సమస్యలతో ఆయనకు నిన్న శస్త్ర చికిత్స జరిగిన విషయం తెలిసిందే.