ADB: బోథ్ మండల కేంద్రానికి వచ్చే ప్రజల సౌకర్యార్థం చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు గ్రామ సర్పంచ్ కుర్మే అన్నపూర్ణ అన్నారు. ఎండల తీవ్రత పెరిగిన నేపథ్యంలో పలు పనుల రీత్యా మండలానికి వచ్చే ప్రజలు చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ మేరకు సర్పంచ్ అన్నపూర్ణను ఎంపీడీవో రమేష్ అభినందించారు. ఉప సర్పంచ్ విజయలక్ష్మి, మహేందర్ తదితరులు ఉన్నారు.