KMR: డోంగ్లి మండల కేంద్రంలో ఆదివారం బసవేశ్వర జయంతి వేడుకలు నిర్వహించారు. జంగమ సమాజం ఆధ్వర్యంలో బసవేశ్వర విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. కుల, లింగ, వివక్షకు వ్యతిరేకంగా బసవేశ్వరుడు ఎంతో పోరాటం చేశారన్నారు. అలాంటి మహనీయున్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.