ADB: ఆదివాసీల ‘భూమి.. భుక్తి.. విముక్తి’ నినాదంతో సాగిన పోరాటంలో అమరులైన వీరుల సంస్మరణకు ఇంద్రవెల్లి సన్నద్ధమైంది. 1981 ఏప్రిల్ 20న జరిగిన పోలీసు కాల్పులకు రేపటితో 45 ఏళ్లు పూర్తవుతున్నాయి. 13 మంది గిరిజనుల బలిదానానికి ప్రతీకగా నిలిచిన ఎర్ర స్మారక స్తూపం వద్ద వారికి నివాళులు అర్పించేందుకు ఆదివాసీలు భారీగా చేరుకుంటున్నారు.