SKLM: నరసన్నపేట మండలం సంపత్ సాయి జూనియర్ కళాశాలలో ఆదివారం శక్తి యాప్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆపద సమయంలో శక్తి యాప్ తోడు ఉంటుందని టెక్కలి డివిజన్ శక్తి టీంకు చెందిన హెడ్ కానిస్టేబుల్ ఎం. గిరిధర్ అన్నారు. మీస్మార్ట్ మొబైల్లో యాప్ ఇన్స్టాల్ చేసుకుని పోలీస్ సహాయం పొందవచ్చునని అన్నారు. రహదారిప్రయాణంలో హెల్మెట్ ధారణ తప్పనిసరని సూచించారు.