ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ కాంబోలో రాబోతున్న ‘రాకా’ మూవీపై క్రేజీ అప్డేట్ వైరల్ అవుతోంది. భారీ మేకింగ్ కారణంగా ఈ మూవీ 2027లో రావడం కష్టమని భావించినా, అట్లీ మాత్రం పక్కా ప్లాన్‌తో ఉన్నాడట. బన్నీ తన షూటింగ్‌ను ఈ ఏడాది చివరికల్లా పూర్తి చేయనుండటంతో, 2027 సెకండ్ హాఫ్‌లో మూవీని విడుదల చేయాలని టీమ్ భావిస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది.