MHBD: మరిపెడ మండలంలోని ఎల్లంపేట గ్రామంలో నూతన శివాలయం, బొడ్రాయి ప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా ముస్లిం సంఘం పెద్ద మనస్సుతో రూ.20,116 విరాళం అందించారు. సోదరభావం సమాజాన్ని బలపరుస్తుందని మరోసారి ఎల్లంపేట ప్రజలు నిరూపించారు. ఈ సందర్భంగా విరాళం అందించిన ముస్లిం సోదరులకు కృతజ్ఞతలు తెలిపారు.