SRD: పటాన్చెరువు శాంతినగర్, శ్రీనగర్ జంట కాలనీలలో కొలువైన అయ్యప్ప స్వామి దేవాలయంలో కాటా శ్రీనివాస్ గౌడ్ హాజరై గణపతి హోమంలో పాల్గొని పవిత్ర పూజలు నిర్వహించినట్లు ఆలయ గౌరవ అధ్యక్షుడు రమా సంజీవరెడ్డి తెలిపారు. ఆలయ వార్షికోత్సవ సందర్భంగా గణపతిహోమం, కుంకుమార్చన, కలశముల పూజ, అభిషేకములు నిర్వహించినట్లు గురు స్వామి పేర్కొన్నారు.