HYDలో నిర్వహించిన ‘డెకాయిట్’ థ్యాంక్యూ మీట్లో హీరో అడవి శేష్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ‘ఓ అభిమాని నాతో మాట్లాడుతూ.. ఒకానొక సమయంలో నాపై 150 మంది దాడి చేయడంతో నేను చాలా కాలం హాస్పిటల్లో ఉన్నా. అప్పుడు బయటకు వెళ్లాలన్నా భయం వేసింది. కానీ ‘మేజర్’ సినిమా చూసి ధైర్యం వచ్చింది. ‘డెకాయిట్’ మూవీ కూడా చూసాను. నాకు చాలా బాగా నచ్చింది అని చెప్పాడు’ అని హర్షం వ్యక్తం చేశాడు.