PPM: మహిళల సాధికారతే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, స్వయం శక్తితో ప్రతి మహిళా ఆదాయాన్ని సమకూర్చుకోవాలని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. శనివారం పార్వతీపురంలో గల శుభమస్తు కళ్యాణ మండపంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో వీఓఏలకు 5జీ స్మార్ట్ ఫోన్లు 21 మంది లబ్ధిదారులకు అందించారు.