ప్రజాస్వామ్యానికి పెద్ద విజయమని కాంగ్రెస్ నాయకురాలు, ఎంపీ ప్రియాంక గాంధీ అన్నారు. ఇది డీలిమిటేషన్, మహిళల హక్కుల కోసం కాదని, విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి ప్రభుత్వాన్ని ఓడించాయన్నారు. కేంద్రం మహిళలను తప్పుదోవ పట్టించొద్దని సూచించారు. మహిళలకు తమ హక్కులను కల్పించాలన్నారు. ప్రభుత్వానికి చీకటి రోజు.. తొలిసారి తీవ్ర కుదుపునకు లోనైందన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారన్నారు.