NLG: మేట్లకు ట్రైనింగ్ క్యాంపు నిర్వహించి ఉపాధి హామీని పటిష్టంగా అమలు చెయాలని వ్యకాస రాష్ట్ర కమిటీ సభ్యులు ఆనంద్ అన్నారు..సోమవారం పెద్ద అడిశర్లపల్లి మండలంలో ఎంపీడీవోకి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఫీల్ అసిస్టెంట్ పర్మినెంట్ చేయాలని పేదల సాగు భూముల అభివృద్ధికి పనులు చేపట్టి కేంద్ర బడ్జెట్లో కనీసం రూ. 2.64 లక్షల కోట్ల కేటాయించాలన్నారు.