NLG: ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేసి తూకాల్లో మిల్లర్ల మోసాలను అరికట్టాలని రైతు సంఘం రాష్ట్ర మహిళా కన్వీనర్ కందాల ప్రమీల డిమాండ్ చేశారు. రైతు సంఘం కట్టంగూర్ మండల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం మండలంలోని ఇస్మాయిల్పల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.