GDWL: గట్టు మండలం పరిధిలోని మల్లంపల్లి, చిన్నోనిపల్లి గ్రామాల్లో సోమవారం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ ఎంపీపీ జె. విజయ్ కుమార్ గృహప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొని ఇళ్లను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి పేదవాడికి సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. అనంతరం ఈ కార్యక్రమంలో సర్పంచులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.