NDL: నంద్యాలలోని క్యాంపు కార్యాలయంలో శనివారం మంత్రి ఎన్ఎండి ఫరూక్ ముఖ్య కార్యకర్తలు, నాయకులతో సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ రాజకీయ పరిస్థితులు, అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలపై చర్చించారు. సంక్షేమ పథకాలు అర్హులకు చేరేలా కృషి చేయాలని సూచించారు. అభివృద్ధి పనుల్లో జాప్యం లేకుండా అధికారులతో సమన్వయం చేయాలని తెలిపారు. కార్యకర్తలకు అండగా ఉంటామన్నారు.