MNCL: తాండూర్ మండలం భారేపల్లెకు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ జయరాం (40) వడదెబ్బ తాకి మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. శనివారం మంచిర్యాల నుంచి ఇసుక తీసుకువచ్చి నీరసంగా ఉందని ఇంట్లో పడుకున్నాడు. విరేచనాలు, వాంతులతో బాధపడుతుండగా కుటుంబీకులు బెల్లంపల్లి ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం మంచిర్యాల తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడన్నారు.