MDCL: ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అల్వాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్లు శ్రీకాంత్, శైలజ మాట్లాడుతూ.. మలేరియా నివారణకు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, నీరు నిల్వ కాకుండా చూడడం, కిటికీలకు మెష్‌లు అమర్చుకోవడం, దోమతెరలు వినియోగించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.