ఏలూరు పట్టణంలోకి భారీ మరియు రవాణా వాహనాలకు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అనుమతులు లేవని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ లక్ష్మణరావు తెలిపారు. అనుమతుల లేకుండా భారీ వాహనాలు పట్టణంలోకి వస్తే చర్యలు తీసుకుంటామన్నారు. పట్టణంలో మైనర్లు వాహనాలు నడిపితే చర్యలు తీసుకుంటామని ప్రతి ఒక్కరు ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని ట్రాఫిక్ నిబంధనలను పాటించాలన్నారు.