AP: మాజీమంత్రి కారుమూరి ఇంటితో పాటు, మిథున్ రెడ్డికి చెందిన PLR సంస్థలోనూ సిట్ తనిఖీలు నిర్వహించింది. 4 గంటల పాటు కారుమూరిని విచారించిన సిట్.. మద్యం రవాణా టెండర్లలో పాత్రపై విచారించింది. ‘కారుమూరి స్టేట్మెంట్ రికార్డు చేశాం. అవసరమైతే మరోసారి విచారిస్తాం. రూ.250 కోట్ల వరకు ప్రభుత్వ ఆదాయానికి.. గండి కొట్టినట్లు కారుమూరిపై ఆరోపణలు ఉన్నాయి’ అని సిట్ ఎస్పీ పేర్కొన్నారు.