అపరిష్కృతంగా ఉన్న టీచర్ల సమస్యల పరిష్కారం కోసం ఫ్యాప్టో ఆధ్వర్యంలో విజయవాడ ధర్నాచౌక్ వద్ద ఈ నెల 25-27 తేదీల్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు ఆ సంఘం నాయకులు తెలిపారు. 12వ PRC సంఘాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని, CPS రద్దు చేసి OPS అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇంకా పెండింగ్లో ఉన్న 4 DAలకు, లీవ్ ఎన్కాష్మెంట్ నిధులను విడుదల చేయాలన్నారు.