WGL: వరంగల్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ దాడుల్లో భారీ అవినీతి వెలుగులోకి వచ్చింది. సబ్-రిజిస్ట్రార్లు దావులూరి ఆనంద్, జలమాపురం రామనరసింహారావు లంచాల వసూళ్లకు పాల్పడినట్లు తేలింది. ప్రైవేట్ రైటర్ల ద్వారా ప్రజల నుంచి డబ్బు వసూలు చేసినట్లు గుర్తించారు. రూ. 44 లక్షలకుపైగా లావాదేవీలు బయటపడ్డాయి. సోమవారం ఇద్దరిని ఏసీబీ అరెస్టు చేశారు.