KNR: శంకరపట్నం మండలం కేశవపట్నం చిన్నవేణి కొమరయ్య (84) ఆత్మహత్యకు పాల్పడ్డారు. చిన్న కొడుకు చిన్నవేణి ఐలయ్య, కోడలు పద్మతో ఆస్తి విషయంలో తగాదాలే కారణాలుగా తెలుస్తున్నాయి. మనస్థాపం చెందిన ఆయన సోమవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య చిన్నవేణి ఎల్లవ్వ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.