NZB: బాల్కొండ మండలం కిసాన్ నగర్ గ్రామంలో శనివారం రూ.67,000 విలువైన 4 సీఎంఆర్ఎఫ్ చెక్కులను నాయకులు పంపిణీ చేశారు. సర్పంచ్ రాంరాజ్ గౌడ్, ఉపసర్పంచ్ స్వామినాథ్, గ్రామ శాఖ అధ్యక్షులు శరత్ తదితరులు లబ్ధిదారులకు ఈ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆర్థిక సాయం అందించిన ఎమ్మెల్యేకు లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.