KDP: వైబ్రేంట్స్ ఆఫ్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో మైదుకూరులో విద్యార్థులు 100 మీటర్ల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. డ్రగ్స్ సమాజానికి ప్రమాదమని, అందరూ అవగాహనతో ఉండాలని డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ రాజశేఖర్ సూచించారు. డ్రగ్స్ వాడకం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, ప్రముఖులు, తదితరులు పాల్గొన్నారు.