కృష్ణా: కంకిపాడు మండలం గంగూరు సరిహద్దు నుంచి వేల్పూరు లక్ష్మీపురం వరకు ఎన్ఆర్జీఎస్ నిధులతో రూ.65 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన రోడ్డును ఎమ్మెల్యే బోడె ప్రసాద్ బుధవారం ప్రారంభించారు. స్వాతంత్య్రం తర్వాత కూడా లేని కనెక్టివిటీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో సాధ్యమైందని చెప్పారు. ఈ రోడ్డుతో గ్రామాల మధ్య రాకపోకలు, అత్యవసర సేవలు సులభమవుతాయని తెలిపారు.