ELR: జంగారెడ్డిగూడెం ప్రజాసంఘాల కార్యాలయంలో ఇవాళ వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘం సమావేశం నిర్వహించారు. రైతు సమస్యల పరిష్కారానికి జరుగుతున్న రాష్ట్ర సదస్సు ఈనెల 25వ తేదీన జంగారెడ్డిగూడెంలో జరుగుతుందని తెలిపారు. కోకో, పామాయిల్, వరి, మొక్కజొన్న, జీడి, పొగాకు, తదితర పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని ఈ సదస్సులో ప్రస్తావిస్తారన్నారు.