TG: SLBC టన్నెల్ ఘటనపై మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి తీవ్రంగా స్పందించారు. టన్నెల్లో గల్లంతైన వారి ఆచూకీ ఏమైందని ప్రశ్నించారు. సుంకిశాల కూలిపోయినా, టన్నెల్ ప్రమాదం జరిగినా NDSA ఎందుకు స్పందించడం లేదని బీజేపీని నిలదీశారు. ఈ మౌనమే కాంగ్రెస్, బీజేపీల మధ్య ఉన్న రహస్య బంధానికి నిదర్శనమని, ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.