GDWL: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని ఎన్సీడీ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ మొహమ్మద్ అజ్గర్ అలీ బుధవారం సందర్శించారు. మెంటల్ హెల్త్, పీడియాట్రిక్ వార్డులను తనిఖీ చేసిన ఆయన.. ఎండదెబ్బ, కుక్కకాటు, పాముకాటు కేసుల వివరాలను ఎప్పటికప్పుడు ఐహెచ్ఐపీ పోర్టల్‌లో నమోదు చేయాలని ఆర్ఎంవో వెంకట్ దాస్‌కు సూచించారు. అలాగే ఓఆర్ఎస్ పంపిణీ వివరాలను ప్రతిరోజూ అప్డేట్ చేయాలని ఆదేశించారు.