అన్నమయ్య: మదనపల్లిలో కేంద్రీయ విద్యాలయం ప్రారంభం కావడం పట్టణ ప్రజల దీర్ఘకాలిక కల నెరవేరినట్టేనని కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. వలసపల్లిలో తాత్కాలిక భవనంలో విద్యాలయాన్ని ఘనంగా ప్రారంభించారు. ఐదు ఎకరాల్లో శాశ్వత భవనాల నిర్మాణానికి త్వరలో చర్యలు చేపడతామని వెల్లడించారు. విద్యార్థులకు నాణ్యమైన ఆధునిక విద్య అందుబాటులోకి వస్తుందన్నారు.