WGL: రాయపర్తి మండలం కాట్రపల్లి ZP పాఠశాల విద్యార్థులు క్రీడల్లో ప్రతిభ చాటారు. CM కప్, ఎస్జీఎఫ్ పోటీల్లో రాణించిన విద్యార్థులకు బుధవారం MEO శ్రీనివాస్ ప్రశంసాపత్రాలు అందజేశారు. MEO మాట్లాడుతూ.. చిన్న వయస్సు నుంచే క్రీడల్లో మెరుగైన ప్రతిభ చూపాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ పద్మబ్రహ్మచారి, HM ఝాన్సీలక్ష్మి, PET సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.