NGKL: చారకొండ మండల కేంద్రంలో గొర్రెల, మేకల సంతను సర్పంచ్ విజేందర్ గౌడ్ ఇవాళ ప్రారంభించారు. స్థానిక పెంపకందారులు, వ్యాపారుల సౌకర్యార్థం ఈ సంతను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ సంతతో క్రయవిక్రయాలు సులభతరం కానున్నాయని రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గణేశ్, వార్డు సభ్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.