మంచిర్యాల: దండేపల్లి మండల కేంద్రంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. మహిళా బిల్లును కాంగ్రెస్ అడ్డుకున్నదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీజేపీ మాజీ అధ్యక్షులు రాజయ్య ఆధ్వర్యంలో శనివారం దండేపల్లి మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేయడానికి ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు.