NZB: సిరికొండ మండలం జగదాంబ తండాలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి శనివారం ఏఈ చంద్రశేఖర్ పర్యటించారు. గ్రామంలోని వీధి స్తంభాలకు ఉన్న లూజ్ కనెక్షన్లను ఆయన స్వయంగా పరిశీలించారు. విద్యుత్ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మలావత్ సుగుణ, ఉప సర్పంచ్ గణేష్ తదితరులు పాల్గొన్నారు.