గద్వాల జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో BKMR T20 క్రికెట్ టోర్నమెంట్‌ను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇవాళ ప్రారంభించారు. ఇవాళ్టి నుంచి 26 వరకు జరిగే ఈ టోర్నమెంట్లో విజేతలకు రూ.2,22,222, రన్నరప్‌కు రూ.1,11,111 బహుమతులు అందజేయనున్నారు. ఎమ్మెల్యే క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. క్రీడలలో గెలుపు ఓటమిలు సహజమన్నారు.