MNCL: హిందూ ధర్మం విశిష్టతను ప్రతి భారతీయుడు తెలుసుకోవాలని ఆధ్యాత్మికవేత్త బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి అన్నారు. బెల్లంపల్లి పట్టణంలో ఏర్పాటు చేసిన హిందూ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. హిందూ అనేది మతం కాదని, హిందూ ధర్మం ఒక జీవన విధానం అన్నారు. మనమంతా హిందూ ధర్మాన్ని ఆచరించాలని, ధర్మాన్ని కాపాడే వారసులుగా ఉండాలని సూచించారు.