AP: బాపట్ల జిల్లా సమీపంలో బెంగళూరు-నరసాపురం రైలులో అర్ధరాత్రి దోపిడీ జరిగింది. స్పెషల్ ఎక్స్ప్రెస్ రైలులో 4 కోచ్లలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. ప్రయాణికుల నుంచి సుమారు 11 తులాల బంగారం ఎత్తుకెళ్లినట్లు ప్రయాణికులు వాపోయారు. అప్పికట్లలో రైలు ఆపి పది మంది దిగి వెళ్లిపోయినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు.