KMM: విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని కృషి చేయాలని కలెక్టర్ అన్నారు. రఘునాథపాలెం మండలం వెంకటాయపాలెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన వార్షికోత్సవంలో కలెక్టర్ అనుదీప్ శనివారం పాల్గొన్నారు. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడం లక్ష్యమని తెలిపారు. ఎవ్రీ చైల్డ్ రీడ్స్ కార్యక్రమంతో పఠన నైపుణ్యాలు పెరుగుతున్నాయని అన్నారు.