NDL: జిల్లా కలెక్టరేట్‌తో పాటు మండల, డివిజన్ కేంద్రాలు, మున్సిపల్ కార్యాలయాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అర్జీలు స్వీకరిస్తామని కలెక్టర్ రాజకుమారి ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ అర్జీలను ప్రత్యక్షంగా ఇవ్వడమే కాకుండా, ఆన్లైన్లో meekosam.ap.gov.in ద్వారా కూడా సమర్పించవచ్చని పేర్కొన్నారు. జిల్లా వాసులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.