KNR: శంకరపట్నం మండల పరిధిలోని ఎస్సీ కార్పొరేషన్ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు శుక్రవారం ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో కృష్ణ ప్రసాద్ తెలిపారు. మండలంలోని 27 గ్రామాల నుంచి మొత్తం 147 మంది దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు ఉదయం 11 గంటలకు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో హాజరు కావాలన్నారు.