TG: ఆర్టీసీ కార్మికులు చర్చల ద్వారానే హామీలు నెరవేర్చుకోవాలని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఆత్మహత్యల జోలికి ఎవరూ పోవద్దని కోరారు. ఆర్టీసీ కార్మికులను కొందరు ప్రేరేపిస్తున్నారని ఆరోపించారు. రెచ్చగొట్టే ధోరణిని రాజకీయ పార్టీలు మానుకోవాలని హితవు పలికారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని.. అప్పు తెస్తే తప్ప నడవని పరిస్థితి అని అన్నారు.