VSP: జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా సమావేశం జరిగింది. ఇవాళ సీతంపేట జనసేన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాజు గౌడ్ మాట్లాడుతూ.. దేశంలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ అగ్రగామిగా నిలిచిందన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రణాళికలు ఫలితాలిస్తున్నాయని చెప్పారు. గుడ్ గవర్నెన్స్, ఉమెన్ ఫ్రెండ్లీ పాలనలో రాష్ట్రం ముందంజలో ఉందని పేర్కొన్నారు.