W.G: తాడేపల్లిగూడెం పట్టణంలో వైసీపీ ఆధ్వర్యంలో కాఫీ విత్ క్యాడర్ కార్యక్రమం ఇవాళ ఉదయం 13వ వార్డులో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ ఇంఛార్జి వడ్డే రఘురామ్ నాయుడు ముఖ్య అతిథిగా హాజరై స్థానిక పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశమై వారి సమస్యలు అడిగితెలుసుకున్నారు. పలువురు స్థానికంగా ఉండే సమస్యలను వివరించారు.