TG: ఆర్టీసీ జేఏసీ నేతలు సచివాలయానికి చేరుకున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఛాంబర్లో ఎదురుచూస్తున్నారు. మంత్రులు వస్తేనే.. చర్చలు జరుపుతామని ఆర్టీసీ జేఏసీ నేతలు స్పష్టం చేస్తున్నారు. లేకపోతే సచివాలయం నుంచి వెళ్లిపోతామని తేల్చి చెప్పారు. ప్రస్తుతం దీనిపై ఉత్కంఠ నెలకొంది.