సత్యసాయి: మంత్రి సత్యకుమార్ యాదవ్ సింగపూర్ పర్యటనలో భాగంగా నాలుగో రోజు అక్కడి మాజీ మంత్రి లిమ్ స్వీ సేతో సమావేశమయ్యారు. దేశాభివృద్ధిలో ప్రభుత్వం, ప్రజలు, ప్రైవేట్ రంగాలు సమన్వయంతో పనిచేసే విధానాలపై వీరు చర్చించారు. పారదర్శకత, జవాబుదారీతనంతో ప్రజల నమ్మకాన్ని పొందుతూ దీర్ఘకాలిక అభివృద్ధి సాధించే వ్యూహాలను పరిశీలించారు.