GNTR: మంగళగిరి వైసీపీ కార్యాలయంలో శుక్రవారం సమావేశం జరిగింది. జిల్లా స్థాయి దివ్యాంగుల విభాగం సంస్థాగత నిర్మాణంపై నేతలు ఈ భేటీ నిర్వహించారు. రాష్ట్ర దివ్యాంగుల విభాగం అధ్యక్షుడు పులిపాటి దుర్గారెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు తదితరులు పాల్గొని పార్టీ బలోపేతంపై చర్చించారు.