PDPL: జ్యోతినగర్లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం ఉత్సవాల సందర్భంగా విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈరోజు భారీ ర్యాలీ నిర్వహించారు. మేడిపల్లి రోడ్డు చిలకలయ్య గుడి నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ ఎఫ్సీఐ క్రాస్ రోడ్డు వరకు సాగింది. ఈ కార్యక్రమంలో హిందూ విరాట్ సమ్మేళనం నిర్వాహకులు సురేశ్, వండర్ శ్రీనివాస్, రవి గౌడ్, రంగారావు, శ్రీనివాస్, తోట కుమార్, తదితరులు పాల్గొన్నారు.