SKLM: జలుమూరు మండలం చల్లవాని పేట వంశధార డిగ్రీ కళాశాలలో ఇవాళ టెక్కలి శక్తి టీం సభ్యులు ఎం. గిరిధర్, డి. శ్రీనివాస్ ఆధ్వర్యంలో ‘శక్తి యాప్’పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులకు స్వీయ రక్షణ, పోలీస్ హెల్ప్ లైన్ నెంబర్ల వినియోగం, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. హెల్మెట్ ధరించడం, మద్యం సేవించి వాహనం నడప రాదని హెచ్చరించారు.