WG: నరసాపురం పెట్రోల్ బంకుల్లో ఆదివారం MRO ఐ.వి.వి. సత్యనారాయణ ఆకస్మిక తనిఖీలు చేశారు. పట్టణంలోని పలు బంకుల్లో ఇంధన నిల్వలు, స్టాక్ రిజిస్టర్లను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. కృత్రిమ కొరత సృష్టించినా, డీజిల్ అమ్మకాల్లో అవకతవకలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని నిర్వాహకులను హెచ్చరించారు. వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా చూడాలని ఆదేశించారు.